![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'.ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1105 లో....వసుధార స్పృహ లోకి వచ్చి మీరే నా రిషి సర్ అని అనగానే.. లేదని సరోజ అంటుంది. చెప్పండి సర్ మీరే నా భర్త రిషి అని వసుధార అంటుంది. అవును నేనే రిషి సర్ ని అని రంగా అనగానే అందరు షాక్ అవుతారు. వసుధార మాత్రం హ్యాపీగా రిషిని హగ్ చేసుకుంటుంది. పదండి సర్.. మనం ఇక్కడ నుండి వెళదాం.. కాలేజీ ప్రాబ్లెమ్ లో ఉందని వసుధార అంటుంది. ఇప్పుడు నువ్వు ఫ్రెష్ అప్ అయి రా అని వసుధారకి రిషి చెప్తాడు.
మరోవైపు ఫణీంద్ర దగ్గరికి దేవయాని వచ్చి కాలేజీలో బోర్డు మీటింగ్ జరిగిందట ఎందుకని అడుగుతుంది. ఎండీ ఎవరు అనే దాని గురించి జరిగిందని ఫణీంద్ర చెప్తాడు. ఎవరేంటి మన శైలేంద్రని ఎండీ చెయ్యొచ్చు కదా.. రిషి, వసుధారలు లేరు కదా అని దేవయాని అంటుంది. నీకెందుకు అంత. వాడి మీద ఓవర్ కాన్ఫిడెన్స్.. వాడికి ఆ కెపాసిటీ లేదని చెప్పాను కదా.. మళ్ళీమళ్ళీ ఎందుకు అంటావ్.. వాడి తెలివి తక్కువతనం వల్ల కాలేజీని ఒకసారి రిస్క్ లో పడేసాడని ఫణీంద్ర అంటాడు. అప్పుడు వాడికి ఇదంతా తెలియదు కానీ ఇప్పుడు వాడికి అంతా తెలుసని దేవయాని అంటుంది. అయినా ఫణీంద్ర తన మాటలు పట్టించుకోడు. మరొకవైపు మను మినిస్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంటే.. అప్పుడే శైలేంద్ర కూడా వెళ్తాడు. మనుని అక్కడ చూసి షాక్ అవుతాడు. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. కాలేజీ గురించి మాట్లాడడానికి వచ్చానని మను అంటాడు. నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చానని మినిస్టర్ తో శైలేంద్ర చెప్తాడు. ఏంటని మినిస్టర్ అడుగగా.. ఇంపార్టెంట్ విషయమని సంబంధం లేకుండా మాట్లాడుతుంటాడు. ఆ తర్వాత కాలేజీ సక్రమంగా నడవాలంటే ఎండీ కంపల్సరీ కావాలని చెప్తాడు. కాసేపటికి మను, శైలంద్ర లు అక్కడ నుండి వెళ్ళిపోతారు
మరొకవైపు ఏంటి బావా.. నువ్వు రిషి సర్ వా.. రంగా కాదా.. ఎందుకు ఇలా అబద్దం చెప్పావ్.. తను అనుకుంటే అనుకోనివ్వు కానీ నువ్వు అనడం ఏంటని సరోజ అడుగుతుంది. డాక్టర్ ఏం చెప్పారు మనసుకి కష్టం కలిగించే విషయాలేం చెపొద్దన్నారు కదా అందుకే అలా రిషి సర్ ని అని అబద్దం చెప్పానని రంగా చెప్తాడు. అప్పుడే వసుధార వచ్చి ఎందుకు వీళ్ళు రంగా అంటున్నారు.. బావ అంటున్నారని వసుధార అంటుంది. నేను రంగానే రిషిని కాదని అనగానే వసుధార షాక్ అవుతుంది. మీ మనసుకి కూడా తెలుసు రిషి సర్ మీరే అని.. మీరు రిషి సర్ అని నిరూపించే వరకు ఇక్కడ నుండి వెళ్ళనని వసుధార అని వెళ్తుంటే కింద పడిపోబోతుంటే రంగా పట్టుకుంటాడు. మీ కళ్ళు చెప్తున్నాయ్.. నా రిషి సర్ అని వసుధార అంటుంది. మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి అని వసుధారకి రంగా చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |